Andhra PradeshKadapaLatestPolitics

చాగలేరు,గుండ్లపల్లి లో విస్తృత ప్రచారం డాక్టర్ దినేష్ రెడ్డి

వేముల ఏప్రిల్

అర్హతే ప్రామాణికంగా తీసుకుని,కులమతాలకు,వర్గాలకు,ప్రాంతాలకు మరియు పార్టీ అతీతంగా అభివృద్ధి సంక్షేమాన్ని అందించిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించి పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డిని,కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైయస్ అవినాష్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి బామరిది డాక్టర్ ఈ.సి దినేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వేముల మండల పరిధిలోని చాగలేరు,గుండ్లపల్లి గ్రామలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని వేముల మండల కన్వీనర్ నాగెళ్ళ సాంబశివరెడ్డి, వేముల మండల పరిశీలకులు వేముల జెడ్పీటీసీ కొకటం వెంకట బయపు రెడ్డి,పిసిబి సభ్యులు మరక శివ కృష్ణ రెడ్డి,వేముల ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ,యువ నాయకులు నాగెళ్ళ పవన్ విశ్వేశ్వర్ రెడ్డి,హర్ష వర్ధన్ రెడ్డి లతో కలిసి చేపట్టారు.చాగలేరు,గుండ్లపల్లి గ్రామాలలో ప్రతి గడప గడపకు పెళ్లి జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ “ఫ్యాను గుర్తుకు మీ ఓటు” వేయాలని తెలుపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఎక్కడ లంచాలకు తావు లేకుండా గడప వద్దకే సంక్షేమ పథకాలను అందించడంలో సచివాలయ,వార్డు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి తోపాటు సంక్షేమ పథకాలను అందించడం జరిగిందనీ,ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ బోధనను తెచ్చి యుద్ధకు పెద్దపీట వేశారని,ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారని, మహిళా సాధికారతకు ఎంతో తోడ్పడిన వ్యక్తి సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంతో పాటు కడప జిల్లాను అతి తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధిని నెలకొల్పింది వైకాపా ప్రభుత్వంమే అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసేటువంటి వ్యక్తి సీఎం జగన్ అని,ఎన్డీఏ కూటమిలాగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే వ్యక్తిత్వం జగన్ది కాదని అన్నారు.అందుకోసమే మరొకసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి,అవినాష్ రెడ్డి లను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించి అభివృద్ధి బాటలు నెలకొల్పాలంటూ ప్రచారాన్ని సాగించారు.టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చే కుటుంబాలకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, పార్టీ అండదండలు ఎప్పుడు ఉంటాయి అని భరోసానిస్తూ,పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.ముందుగా డాక్టర్ ఈ.సి దినేష్ రెడ్డి చాగలేరు లోని శ్రీ సీతారాముల దేవస్థానం నందు పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.అనంతరం చాగలేరు,గుండ్లపల్లి ప్రజలు ఘనస్వాగతాన్ని పలికి,అడుగడుగునా పూల బాటలు వేస్తూ ఘన స్వాగతాన్ని పలికారు.ఈ కార్యక్రమంలోయువ నాయకులు నాగెళ్ళ మహేశ్వర్ రెడ్డి,ఇసి మహేశ్వర్ రెడ్డి,రామిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి,లాయర్ హరినాథ్ రెడ్డి,పట్రా సంఘం ఆర్గనైజేషన్ డైరెక్టర్ చల్లా సునీల్ కుమార్,గండి మాజీ పాలకవర్గ సభ్యులుచెల్లుబొయిన రెడ్డెయ్య,మాజీ ఎంపీటీసీ మల్ రెడ్డి,చంద్ర శేకర్ రెడ్డి,సుబ్బారెడ్డి,మధు రెడ్డి,హేమాద్రి రెడ్డి,ఎంపీటీసీ లక్ష్మీదేవి,సర్పంచులు చెన్నారెడ్డి,గంగరాజు,అర్జున,కె.వి రమణ,ఉత్తయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button