Blog

సంక్షేమ పథకాల సృష్టి కర్త ను మరోసారి ముఖ్యమంత్రి నీ చేసుకుందాం

*సంక్షేమ పథకాల సృష్టి కర్త ను మరోసారి ముఖ్యమంత్రి నీ చేసుకుందాం*

*సీఎం భామర్థి దినేష్ రెడ్డి*

*వేల్పుల,వేముల లో ఎన్నికల ప్రచారం చేపట్టిన దినేష్ రెడ్డి*

*వేముల మన జనప్రగతి మే 06*

సంక్షేమ పథకాల సృష్టి కర్త ను మరోసారి ముఖ్యమంత్రి నీ చేసుకుందాం అని రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు నిరంతరం కొనసాగాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని  ముఖ్యమంత్రి బమర్థి డాక్టర్ ఇసి దినేష్ రెడ్డి అన్నారు.సోమవారం ఉదయం వేముల మండలం లోని వేల్పుల కాలనీ,వేములలో జగనన్న కాలనీ,ఇమాంసబ్ కొట్టలలో ప్రముఖ వైద్యులు ముఖ్యమంత్రి బమర్ధి ఇసి దినేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని వేముల మండల కన్వీనర్ నాగెళ్ళ సాంబశివరెడ్డి,వేముల జెడ్పీటీసీ కొకటం వెంకట బయపు రెడ్డి,జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ లింగాల ఉషారాణి,వేముల మండల పరిశీలకులు లింగాల రామ లింగారెడ్డి,పిసిబి సభ్యులు మరక శివకృష్ణరెడ్డి,వేముల ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ,యువ నాయకులు నాగెళ్ళ పవన్ విశ్వేశ్వర్ రెడ్డి,హర్ష వర్ధన్ రెడ్డి,స్థానిక సర్పంచ్ నిర్మల,సాకే నాగప్పా,ఎంపీటీసీ బాబ్ జాన్ లతో కలిసి చేపట్టారు.ఈ సందర్బంగా
వేల్పుల కాలనీ,వేములలో జగనన్న కాలనీ,ఇమాంసబ్ కొట్టల లో
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అడుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచిని ప్రజలకు వివరించారు.అర్హతే ప్రామాణికంగా తీసుకుని,కులమతాలకు,వర్గాలకు,ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికీ అందించిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించి పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డిని,కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైయస్ అవినాష్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి బామరిది డాక్టర్ ఈ.సి దినేష్ రెడ్డి పేర్కొన్నారు.గ్రామల లో ప్రతి ఇంటికి,ప్రతి గడపకు వెళ్లి జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ “ఫ్యాను గుర్తుకు మీ ఓటు” బంగారు భవిష్యత్ కు భరోసా అని అని,కావున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు కి ఓటు వేయాలని తెలుపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏటువంటి లంచాలకు తావు లేకుండా గడప వద్దకే సంక్షేమ పథకాలను అందించడం కోసం సచివాలయం,వార్డు వాలంటీర్ వ్యవస్థ ను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి తోపాటు సంక్షేమ పథకాలను అందించడం జరిగిందనీ,ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ బోధనను తీసుకువచ్చారు అని,ఆరోగ్యశ్రీ పరిమితి నీ 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారని,మహిళా సాధికారత యే లక్ష్యం గా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు అని,ప్రతి ఒక్కరూ ఆర్థికం గా ఎదగాలని తపిస్తూ పాలన సాగిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నీ అవినాష్ రెడ్డి లను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించలని ఓటర్లను అడిగారు.ప్రజలు,అడుగడుగునా పూల బాటలు వేస్తూ ఘన స్వాగతాన్ని పలికారు.పలువురికి వైద్యం అందించారు.ఈ కార్యక్రమంలో,ఎంపీపీ భర్త చల్లా వెంకట నారాయణ,ఎంపీటీసీ లు మల్ రెడ్డి,రామచంద్ర రెడ్డి,బాబ్ జాన్,సర్పంచ్ లు నిర్మల, నాగప్ప,శ్రీను,నాగేష్,మాజీ సొసైటీ అధ్యక్షులు శివ శంకర్ రెడ్డి,యువ నాయకులు నాగెళ్ళ మహేశ్వర్ రెడ్డి,రామిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి,లాయర్ హరినాథ్ రెడ్డి,కల్లూరు నిరంజన్ రెడ్డి,చల్లా సునీల్ కుమార్,లక్ష్మణ,శ్రీధర్,రాములయ్యా,యువ నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button