వి.కొత్తపల్లి వద్ద రెండు బైకులు ఢీ
<img src="వి.కొత్తపల్లి వద్ద రెండు బైకులు ఢీ
ఒకరికి కాలు విరగగా,మరొకరికి స్వల్ప గాయాలు
వేముల మండల పరిధిలోని కడప – పులివెందుల ప్రధాన రహదారి నందు గల వి.కొత్తపల్లి వద్ద సోమవారం సాయంత్రం రెండు బైకులు ఢీ కొన్న ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే కొత్తపల్లి గ్రామానికి చెందిన నల్లబల్లె వీరయ్య (62) రహదారి పక్కన ఉన్న తమ ఇంటి నుండి సూపర్ ఎక్సెల్ లో బయలుదేరి బస్ స్టాప్ నందు రోడ్డు క్రాస్ చేస్తున్న నేపథ్యంలో పులివెందుల నుండి వేంపల్లి వైపు బైక్ లో వెళ్తున్న మహమ్మద్ (33) అనే వ్యక్తి బైక్ ఢీ కొనడం జరిగింది.అయితే నల్లబల్లె వీరయ్యకు కాలు విరగగా,పులివెందుల కు చెందిన మహమ్మద్ మరియు వెనక కూర్చుని ఉన్న అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి.అయితే ఈ ఘటనను చూసిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం వేంపల్లి ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లబల్లే వీరయ్యకు కాలు తిరగడం వలన అక్కడ నుంచి కడప ఆసుపత్రికి తరలించారు.” alt=”” width=”300″ height=”261″ class=”alignnone size-medium wp-image-60″ />