చంద్రబాబు మదిలో నెక్ట్స్ సీఎస్..ఇతనికే ఛాన్సా..?
రాష్ట్రంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నిక.. ఓ ప్రభంజనం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పట్టారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చాలా మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
జవహర్ రెడ్డి దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ధోరణి.. మండలాల్లో ఉండే తాహసీల్దార్ వరకు కఠినంగా అమలైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. చాలా మంది సీవిల్ సర్వీస్ అధికారులు.. నేటికి పోస్టింగ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది కాలంలో నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎస్ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ పాలనపై ఉక్కపాదం
ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదమే మోపింది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ.. కూటమి ఆలోచనలను ఆచరణలో పెట్టాల్సిన గురతర బాధ్యత సీఎస్ పైనే ఉంటుంది. ఎప్పటిలాగేనే సీనియారిటీ లిస్ట్ తీస్తే రేస్ లో ఉన్న పేరు చూస్తేనే అందరూ షాక్ కు గురవుతున్నారు. కానీ ఆ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పదవి రాదు, రానివ్వరు. ఎందుకంటే ఆమె పేరు యర్రా శ్రీ లక్ష్మీ. వైఎస్ఆర్ టీంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు.. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదురుకుని.. జైలుకు సైతం వెళ్లి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీకి వచ్చి, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పిన్సిపల్ సెక్రటరీగా ఆమె వ్యవహరించారు. ప్రభుత్వం మారాక ఆమెకు ఇప్పటిదాకా పోస్టింగ్ ఇవ్వలేదు.ఒన్ అండ్ ఓన్లీ మ్యాన్
అయితే ఇప్పుడు రేస్ లో ముందున్న వారందరిని కాదని… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓ వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయనే కే.విజయానంద్. ప్రస్తుతం ఆయన ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ ఛీప్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.రాష్ట్ర విభజన దగ్గర నుంచి నేటి వరకు ఆయన విద్యుత్ శాఖకే తన సేవలందిస్తున్నారు.ప్రభుత్వాలు మారినా కూడా ఆయన శాఖ మారడం లేదంటే విద్యుత్ శాఖపై ఆయనుకున్న పట్టు అలాంటిది.దీంతో పాటు ఇటీవల దేశవ్యాప్తంగా ప్రకంపనలురేపిన అదానీ – సెకీ వ్యవహారంలో సైతం ఈయన చాకచక్యాన్ని ప్రదర్శించడం సీఎం చంద్రబాబుకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏపీకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చాలా కీలకం.రాష్ట్ర విడిపోయిన దగ్గర నుంచి నేటి వరకు విద్యుత్ శాఖలో తనకున్న పట్టుతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెడుతున్న వ్యక్తి విజయానంద్. బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్‌గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు.రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు.విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీంతో పాటు ఆయన గతంలో ఇన్ ఛార్జ్ సీఎస్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేల సపోర్ట్
అసలు ఒక సీఎస్ నియామకానికి ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఫలానా వ్యక్తి ఛీప్ సెక్రటరీగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మి…. ఆయనకు మద్దతిస్తున్నారు 35 మంది ఎమ్మెల్యేలు. ఇది విజయానంద్ కు పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. మద్దతు ఇస్తున్న వారు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు అనుకుంటే పొరపాటే. కూటమిలో ముఖ్యనేతలుగా కొనసాగుతున్న సీనియర్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలుకుని ఫస్ట్ టైం శాసనసభకు వచ్చిన వారు కూడా విజయానంద్ కు మద్దతుగా ఉన్నారు.
బీసీలకు టీడీపీ పెద్ద పీట
టీడీపీ బీసీల పార్టీ అని అవకాశం వచ్చిన ప్రతిసారి నిరూపించే ప్రయత్నం చేస్తుంటారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఒక బీసీకి ఛాన్స్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావించినట్లు కీలక సమాచారం. ఇదే నిజమైతే.. ఇక సీఎస్ గా విజయానంద్ నియామకాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు సమాచారం.