Andhra PradeshKadapaLatestPolitics

మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం

మరోసారి అధికారంలోకి వస్తున్నాం

సీఎం జగన్

విజయవాడ మన జనప్రగతి ఏప్రిల్ 15:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి ఘటన సంగతి తెలిసిందే విజయవాడలో ఆయనపై రాయితో దాడి చేయగా తలకు గాయమైంది ఆదివారం విశ్రాంతి అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది అయితే ఈ దాడి ఘటనపై సీఎం స్పందించారు ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుంచి తప్పించుకోగలిగానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించారరు అయితే యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణా ఎన్టీఆర్‌ జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిశారు ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి ధైర్యంగా అడుగులు ముందుకు వేద్ధాం ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదం నుంచే దాడి నుంచి తప్పించుకున్నా మరోసారి అధికారంలోకి వస్తున్నాం ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవు’’ అని సీఎం జగన్‌, పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు’ జగన్.మరోవైపు దాడి ఘటన తర్వాత సీఎం జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీలతో భద్రత కల్పిస్తారు ముఖ్యమంత్రి రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి సెక్టార్కు ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు సెక్యూరిటీ కల్పిస్తారు ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే జగన్ రోడ్లు, సభలు ఉండనుండగా గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరోవైపు సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఆయన్ను పలువురు పార్టీ నేతలు కలిశారు. తలకు ఉన్న గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ నేతలతో నవ్వుతూ, చాలా సరదాగా మాట్లాడారు.మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గులకరాయి వచ్చి ఆయన తలకు తగిలింది. కళ్లు పై భాగాన్న నుదిటికి గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయం తర్వాత విజయవాడ సమీపంలోని కేసరపల్లిలోని నైట్ హాల్ట్‌కు చేరుకున్నారు. గాయం కారణంగా ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు. గాయం నుంచి కోలుకోవడంతో సోమవారం తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్రను జగన్ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button