90 వేల మెజారిటీ వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పై ఎందుకు ఒత్తిడి

90 వేల మెజారిటీ వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పై ఎందుకు ఒత్తిడి ఎమ్మెల్సీ మా రెడ్డి రవీందర్ రెడ్డి పులివెందుల ఫిబ్రవరి 12 :-అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో 90 వేల పైచిలుకు మెజార్టీ రావడం జరిగిందని అలాంటప్పుడు స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలలో ఎందుకు బలవంతపు ఏకగ్రీవలు చేస్తున్నారని బీటెక్ రవి సూటిగా ప్రశ్నించారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు పథకాలు పని చేయలేదా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గుతుందా ఇతర కారణాల వలన అభ్యర్థులను ఎందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎందుకు బలవంతపు ఏకగ్రీవ సర్పంచులను చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు ప్రజాదరణ ఉన్నప్పుడు ప్రజలు ఓట్ల ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని అలా కాకుండా బెదిరించడం పోలీసులతో కేసులు పెట్టించడం గురిచేస్తూ ఎక్కడ పోటీ ఉండకూడదని దురుద్దేశంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు మీరు ఎన్ని విధాల ప్రజలు లను ఇబ్బంది పెట్టిన అభిమానం అనేది వారు ఎవరిని ఎన్నుకోవాలో వారికే తెలుసు ప్రతి మండల పార్టీ బలపర్చిన అభ్యర్థులను పోటీ నుంచి నిలబడతామని బీటెక్ రవి పేర్కొన్నారు అదేవిధంగా పోలీసు యంత్రాంగాన్ని మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఒత్తిడి తెస్తూ నామినేషన్ వేసిన వారిని పరిశీలన పేరుతో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని అదేవిధంగా మీ నామినేషన్లు తీసేస్తామని బెదిరించారు అలా కాని వారిని తప్పుడు కేసులతో ప్రభావాలు చేయడం మానుకోవాలని బీటెక్ హేతువు పలికారు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి తప్ప బలవంతపు ఏకగ్రీవం లను ప్రోత్సహించకూడదు అని చెప్పుకొచ్చారు ఈ గ్రామానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఆ గ్రామ అభివృద్ధి కోసం అని గ్రామ ప్రజలు నిర్ణయించుకుంటారు తప్ప బలవంతంగా అభ్యర్థులు బెదిరించడం హీనమైన చర్య అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్నా రెడ్డి ప్రసాద్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ కౌన్సిలర్ నాగరాజు రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు