
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సహకరించాలి..
మెడికల్ కాలేజీ పేరుతో పులివెందులలో ఇన్సైడ్ ట్రేడింగ్
ఎమ్మెల్సీ బీటెక్ రవి
పులివెందుల మన జనప్రగతి :-
రాష్ట్రంలో నిర్వహించబోయే స్థానిక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, మెడికల్ కాలేజ్ పేరుతోనే ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతూ వైయస్ కుటుంబీకుల ఆస్తుల విలువలు పెంచుకుంటున్నారని, విలేకర్ల సమావేశంలో బీటెక్ రవి ధ్వజం ఎత్తడం జరిగింది . ఆదివారం కసునూరు గ్రామంలోని తన స్వగృహం నందు ఏర్పాటు చేసినటువంటి విలేకర్ల సమావేశంలో స్థానిక ఎన్నికల గురించి మరియు పులివెందులలో ప్రస్తుత పరిస్థితుల గురించి విమర్శలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో అధికారులు అభ్యర్థులకు సమాచారం అందించడంలో అందుబాటులో ఉండటం లేదని, చిన్న చిన్న కారణాలతో నామినేషన్ పత్రాలను తిరస్కరించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికలు పార్టీలకు అతీతంగా గ్రామ స్వరాజ్యం ని నిర్మించుకోవడం లో భాగంగానే అభ్యర్థులను ఎన్నుకోవాలి తప్ప, పార్టీల పరంగా రెండు వర్గాల తో గ్రామ స్వరాజ్యం స్థాపించడం సాధ్యం కాదన్నారు. అదేవిధంగా అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ వైసీపీ నాయకుల మాటల్లో నిజం లేదని, అది కేవలం పులివెందులలోని రూపుదిద్దుకోవడం జరుగుతుందని, వాటిలో భాగంగా జె.ఎన్.టి.యు పరిసర ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్ వస్తుంది అన్న బ్రమా సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైయస్ కుటుంబీకుల ఆస్తులను విపరీతంగా పెంచి అమ్మడం జరిగిందని, అదేవిధంగా కడప రోడ్ లో మెడికల్ కాలేజీ అంటూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైయస్ కుటుంబీకుల ఆస్తుల విలువలు పెరుగుతున్నాయే తప్ప, సామాన్యులకు భూములు కొనుగోలు చేసే అవకాశాలు లేదని అన్నారు. అదేవిధంగా వైయస్ రాజశేఖర హయాంలో నాలుగవ తరగతి ఉద్యోగస్తులకు కేటాయించిన స్థలాలు నేడు వైసీపీ కార్యకర్తలకు అందించాలన్న చర్యల్లో భాగంగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతోందని, ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకు నేటి వైసిపి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఇంతేనా ,అన్న మాటకి వారికి వారే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహించుకునేందుకు అధికారులు సహకరించాలి తప్ప ,ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిపై చర్యలు తీసుకునే విధంగా పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టి డి పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.