30 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ చారిత్రాత్మకం.ఎం ఎల్ సి జకియా ఖానం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మలతో కలసి ఇళ్లపట్టాల పంపిణీ లో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
రామాపురం న్యూస్ డిసెంబర్ 25రాష్ట్ర సంక్షేమాభివృద్ధిలో వై ఎస్ అంటే ఓ యెస్ అన్న విషయం అన్ని వర్గాల ప్రజలకు తెలిసిన విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాయచోటి రూరల్ మండల పరిధిలోని యండపల్లెలో ఎం ఎల్ సి జకియా ఖానం, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మలతో కలసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ళు లేని కుటుంబాలు ఉండకూడదని లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు.నాడు దివంగత నేత వై ఎస్ ఆర్ పూరిగుడిసెలు కనిపించకుండా పక్కా భవనాలుకు నాంది పలికారన్నారు. ఆరోగ్యశ్రీ,108,104,ఫీజు రీయంబర్స్మెంట్, మహిళలకు పావలా వడ్డీ లేని రుణాలు, యండపల్లె, మాధవరం తదితర గ్రామాల్లో రహదారులు, యండపల్లె లో పి హెచ్ సి తదితర ఎన్నో సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు ను చేపట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు.15 ఏళ్ల చంద్రబాబు పాలనలో చెప్పుకునేదానికి ఒక్క సంక్షేమ పథకమైన ఉందా అని అన్నారు. ప్రజానేత జగన్ తన3600 కిమీ మేర చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఇచ్చిన హామీల ను, ఎన్నికలలో ఇచ్చిన రెండు పేజీల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 16 నెలల పాలనలో 90 శాతంకు పైగా హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.కరోనా తో ఆర్థిక సంక్షోభంఏర్పడినా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా లోటు రానీయకుండా ప్రజల ముఖాలలో చిరునవ్వును చూసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.65 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 4 విడతలుగా రుణాలను మాపీ చేస్తామని చెప్పి, ఇప్పటికే ఒక విడత రుణ మాపీ చేశారన్నారు.ఎస్ సి, ఎస్ టి ,బి సి, మైనారిటీ మహిళలకు వై ఎస్ ఆర్ చేయూత క్రింద ఆర్థిక సహాయాన్ని అందచేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు.విద్యార్థులుకు ఆమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, మధ్యాహ్న భోజనం, రైతులకు రైతు భరోసా, పంటలకు మద్దతు ధర, పంటరుణాలకు సున్నా వడ్డీ తదితర పథకాలును అందిస్తున్నారన్నారు. వర్షాలు కు నవంబర్ నెలలో పంటలు నష్టపోయిన వారికి డిసెంబర్ 29 న పరిహారం అందుతుందన్నారు. రాయచోటి ప్రాంతం లోని చెరువులన్నింటికీ కృష్ణా జలాలను అందించే కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాయచోటి నియోజకవర్గానికి 1700 పక్కా ఇళ్లను మంజూరు చేశారని, ఆ ఇళ్లకు నేటికి రూ 4 కోట్ల రూపాయల బిలులు బకాయిలు ఉన్నాయని, ఆ బిల్లులనూ ఈ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులు , ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చారన్నారు. బోయపల్లె సమీపంలోని గరికుంట ఆనకట్ట అభివృద్ధి కి ఆరు మాసాలలో చర్యలు తీసుకుంటామన్నారు.వెలిగల్లు ప్రాజెక్ట్ నుంచి చెరువులకు నీళ్లు అందించే రూ 90 కోట్లతో చేపట్టిన పనులతో కాటిమాయకుంట, మాధవరం తదితర గ్రామాల్లో చెరువులకు నీళ్లు అందించే పనులు జరుగుచున్నాయన్నారు. ప్రజా సహకారంతో, కార్యకర్తలు, నాయకుల
అర్హులందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ అన్నారు. జిల్లాలో 1.36 లక్షల ఇళ్ల పట్టాలను అందచేస్తున్నామన్నారు. ఇంటి పట్టా ఇచ్చి లబ్దిదారుడి సహకారంతో త్వరగా గృహప్రవేశాలు చేయిస్తామన్నారు.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో గ్రామ సచివాలయ నిర్మాణాలు, నాడు నేడు పాఠశాలల అభివృద్ధి పనులలో రాష్ట్ర స్థాయిలో రాయచోటి ముందంజలో ఉందనిఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ని ఆయన అభినందించారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్: ఎం ఎల్ సి జకియా ఖానం. అర్హులందరికీ ఇళ్లపట్టాలు ఇస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీని నేడు సీఎం జగన్ నెరవేర్చడం ఆనందంగా ఉందని ఎంఎల్ సి జకియా ఖానం అన్నారు.ఓటు వేయని వారికి సైతం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందివ్వడమే జగనన్న లక్ష్యమన్నారు.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషి నియోజకవర్గం అన్ని రంగాలలోఅభివృద్ధి చెందుతోందన్నారు. పారదర్శకంగా జగనన్న పాలన: మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి. పారదర్శకంగా జగనన్న పాలన జరుగుతోందని మాజీ ఎం పి పి పోలు సుబ్బారెడ్డి అన్నారు.పండుగ వాతావరణంలో పారదర్శకంగా పట్టాలు పంపిణీ అవుచుండడంలో పేదలలో ఆనందోత్సాలు నిండుకున్నాయన్నారు. నియోజక వర్గ ప్రత్యేక అధికారి సృజన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 16 వేలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ అవుచున్నాయన్నారు. తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జిల్లా సర్పంచుల సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాల మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనం ఉండేదని , ఇప్పుడు జగనన్న ప్రభుత్వం లో అర్హతే ప్రామాణికమన్నారు. జెడ్ పి టి సి అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ జనరంజకంగా జగన్ పాలన జరుగుతోందన్నారు. మైనారిటీ నాయకుడు అంజాద్ అలీఖాన్ మాట్లాడుతూ పేదల పక్షపాతి సీఎం జగన్ అని అన్నారు.వై ఎస్ ఆర్ సీపీ యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదనమోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శంగా సాగుతోందన్నారు. వై ఎస్ ఆర్ సీపీ నాయకులు కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి, ఆనంద రెడ్డి తదితరులు ప్రసంగించారు.మోడల్ స్కూల్ లో 8 వ తరగతి చదువుచున్న ఆయేషా అనే విద్యార్థిని చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.వై ఎస్ ఆర్ జగనన్న కాలనీ నిర్మాణాలకు శంఖుస్థాపనలు…రాయచోటి మండలంలోని యండపల్లె గ్రామానికి చెందిన 168 మంది లబ్దిదారులకు ఎస్ డబ్ల్యూ పి క్యూ సమీపంలోని, మాధవరం గ్రామానికి చెందిన 371 మంది లబ్దిదారులకు వెంకటాపురంలో, కాటిమాయ కుంటకు చెందిన 223 మంది లబ్ధిదారులకు ఎద్దులగుట్ట గుట్ట సమీపాన నిర్మించనున్న వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలును సందర్శించి ఇళ్లపట్టాలును అందచేసి, గృహనిర్మాణాలుకు ఎం ఎల్ సి జకియా ఖానం, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ లతో కలసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి భూమిపూజలు చేశారు. లే అవుట్ లలో మొక్కలు నాటారు. అర్హత ఉండి ఇంటి పట్టాలు రానివారికి ప్రభుత్వం తిరిగి కేటాయిస్తుందని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఇళ్ల పట్టాలు, లే అవుట్ నిర్మాణాలకు కృషిచేసిన అధికారులు, సిబ్బందికి సత్కారాలు…ఇళ్ల పట్టాలు, వై ఎస్ ఆర్ జగనన్న కాలనీ నిర్మాణాలకు స్థల సేకరణ చేపట్టి వాటి పంపిణీకి కృషి చేసిన రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ లు దుస్సాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు.యండపల్లె గ్రామసచివాలయ, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలపరిశీలన..యండపల్లె గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాలును ఎం ఎల్ సి జకియా ఖానం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ లతో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఇళ్ల పట్టాల పంపిణీని వీక్షించిన ప్రజలు..కాకినాడలో ముఖ్యమంత్రి జగన్ చేతులమీదుగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలుతో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మలు వీక్షించారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తీక్షణంగా ప్రజలు వీక్షించారు.ఊరూరా ఆత్మీయస్వాగతాలు.. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ గ్రామాలకు వెళ్లిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం, అధికారులతో కలసి గ్రామాలకు వెళ్లిన ప్రజలు, లబ్ధిదారులు గజమాలలుతో ఆత్మీయ స్వాగతం పలికారు.జగనన్న ప్రభుత్వంతో తమకు సొంతింటి కల నెరవేరుతోందంటూ లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ చీఫ్ విప్, ఎం ఎల్ సి లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నరసింహా ప్రసాద్, ఈ ఓ పి ఆర్ డి సురేష్, వై ఎస్ ఆర్ సీపీ నాయకులు పల్లపు రమేష్, సింగల్ విండో అధ్యక్షుడు బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, మాజీ ఎం పి టి సి లు ప్రభాకర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, నాయకులు భూషణ్ రెడ్డి,ఖాదర్ వలీ,హాబీబుల్లా ఖాన్,ఆసీఫ్ అలీఖాన్, బోరెడ్డి నారాయణరెడ్డి, ఆనంద రెడ్డి, మహమ్మద్ రఫీ, రమణా రెడ్డి, దివాన్, గంగిరెడ్డి, రమేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,నరసింహులు, అమరనాధ,చంద్రశేఖర్ నాయుడు, పెద్దినాయుడు తదితరులు పాల్గొన్నారు.