AnanthapurAndhra PradeshLatest News
25 కేజీల గంజాయి పట్టివేత

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి సర్కిల్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీలో భాగంగా మారుతి ఏర్టిగా వాహనంలో తరలిస్తున్న 25 కేజీల గంజాయి,ఒక లీటర్ గంజాయి ఆయల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి కారు, ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.