23న జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలుఅండర్ 14,17,19 విభాగాలలో పోటీలు
23న జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలుఅండర్ 14,17,19 విభాగాలలో పోటీలుఅదే రోజున రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకి ఎంపికలు
శ్రీకాకుళం ఫిబ్రవరి 13:-జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని టౌన్ హాల్ వేదికగా ఈ నెల 23న జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను నిర్వహించనున్నట్లుగా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ తెలిపారు. అండర్ 14,అండర్ 17 అండర్ 19 విభాగాలలో బాల,బాలికలకు వేర్వేరుగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లుగా పేర్కోన్నారు. ఈ పోటీలలో పాల్గోనదలచే బాలబాలికలు ముందుగా పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా ఎన్ ఐ ఎస్ కోచ్ జోగిపాటి వంశీ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ నెల 21 వ తేది సాయంత్రంలోగా అర్హులైన క్రీడా కారులు.. పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేసారు. పేర్లను నమోదు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 23న ఉదయం 7.30 గంటలకు నేరుగా టౌన్ హాల్ వద్దకు ఆధార్ కార్డు ,స్టడి సర్టిఫికేట్ ,రెండు ఫోటోలను తీసుకుని హాజరుకావాలని తెలిపారు. ఈ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఈ నెల 27,28,మార్చి 1,2వ తేదిల్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఇతర వివరాల కోసం 7660874844 , 8897567779 సెల్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వైశ్యరాజు మోహన్ కోరారు. జిల్లా స్థాయి పోటీలలో పాల్గోనే అండర్ 14 సబ్ జూనియర్ అభ్యర్ధులు పుట్టిన తేది 1/1/2008 – 1/1/2010 మద్య ఉండాలన్నారు.అలాగే జూనియర్ అండర్ 17 విభాగంలో క్రీడాకారుల పుట్టిన తేది 1/1/2002 -1/1/2007 మద్య ఉండాలని తెలిపారు. అలాగే సీనియర్ విభాగంలో విద్యార్ధుల డేట్ ఆఫ్ బర్త్ 1/1/2000- 1/1/2006 మద్య ఉండాలని వివరించారు. సీనియర్ విభాగంలో పాల్గోనే వారు ఖచ్చితంగా అంతకుముందు సంవత్సరం రాష్ట్ర స్థాయిలో జూనియర్ ,లేదా సీనియర్ విభాగాలలో పోటీ చేసే వారై ఉండాలని ఆయన స్పష్టం చేసారు