Andhra PradeshLatest NewsTelanganaYSR Kadapa
19న దేవునికడపలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు..
కడప, ఫిబ్రవరి
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగాశుక్రవారం రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా రథం మాడ వీధులలో తిరగదు. కేవలం స్వామి వారిని ఆలయ ప్రాంగణంలో వాహనంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి స్వామి వారి దర్శనం భక్తులకు దర్శనం వుంటుంది. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమోహన్, శేషాచార్యులు, త్రివిక్రమ్, కృష్ణమూర్తి, విజయ్, రంగా స్వాములు ఆలయ అధికారులు వెంకటేశం, ఈశ్వర్ రెడ్డి సిబ్బంది మారుతి, వాసు, బాబు, చంద్ర, అంజి, సెక్యూరిటీ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, ఏఈ తదితరులు పర్యవేక్షిస్తారు.