Andhra PradeshCrimeLatest NewsTelanganaYSR Kadapa
11 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
రామాపురం మన జనప్రగతి
మండలంలోని చిట్లూరు పంచాయతీ పాలన గారి పల్లి వద్ద శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 11 క్వింటాళ్ల:27 కేజీల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ జయరాములు తెలిపారు మండల పరిధిలోని చిట్లూరు పంచాయతీ పాలన గారి పల్లె బస్టాప్ సమీపంలో ఏ.పీ04టి.టి3202 నెంబర్ గల ఆటో లో రేషన్ బియ్యాన్ని వేరే సంచుల్లో కి మార్చుకుని తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో ఎస్బిఐ కానిస్టేబుల్ రమేష్ కు అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వెంటనే దాడి చేసి బియ్యం తో సహా ఆటోను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు బియ్యం ఆటో తో సహా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న శంకరయ్య మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు వారిని విచారించగా రాయచోటి మంగల గుట్ట కు చెందిన వారిని వీరిపై కేసు నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు