Andhra PradeshYSR Kadapa
108 అంబులెన్స్ లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
రామాపురం న్యూస్ డిసెంబర్ 20
రామాపురం మండలం పరిధి లోని కల్పనాయుని చెరువు గ్రామం గాలంగుండ్లపల్లికి చెందిన మౌనీశ్వరి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రామాపురం 108 సిబ్బంది హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకొని ఆమెను అంబులెన్స్ లో కడప రిమ్స్ కు తరలించే క్రమంలో కడప ఘాట్ దగ్గర పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ ను పక్కకు అపి మహిళ కు సుఖప్రసవం చేయడం జరిగింది.ఈ క్రమంలో పండంటి ఆడ బిడ్డ జన్మించింది .ఈ కార్యక్రమంలో అల్గోన్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈ ఎమ్ టి రామచంద్ర, పైలెట్ సుందరం మరియు ఆశ వర్కర్ చిట్టెమ్మ కు గర్భిణి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో వరసగా 4 ప్రసవాలు చేసిన ఈ ఎమ్ టి రామచంద్రకు రాయచోటి డివిజినల్ మేనేజర్ అసం శివానందరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు