Andhra PradeshCrimeHyderabadLatest NewsPoliticalTelangana
హైదరాబాద్ పాతబస్తీలో గురువారం రాత్రి ఓ రౌడీషీటర్ హత్య
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో గురువారం రాత్రి ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. బహదూర్ పూరా సమీపంలోని కిషన్ బాగ్ లో రౌడీషీటర్ ఐజాజ్ ను దుండగులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఐజాజ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.