AnanthapurAndhra PradeshLatest NewsPolitical
హైకోర్టు నిర్ణయం నిమ్మగడ్డకు చెంపపెట్టుఅనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి
అనంతపురం, జనవరి 11 మన జనప్రగతి న్యూస్ :-
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఇది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు చెంపపెట్టు వంటిదని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉందన్న హెచ్చరికలు పట్టించుకోకుండా.. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కనీసం పరిశీలించకుండా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహరించారని మండిపడ్డారు. ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నిమ్మగడ్డకు హైకోర్టు నిర్ణయంతో భంగపాటు ఎదురైందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ కేవలం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పని చేశారని గుర్తు చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్‌ను రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.