Andhra PradeshVizianagaram
హెడ్ కాని స్టేబుల్ ను కృష్ణమూర్తిని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ప్రశంసించారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పీఎస్ లో హెడ్ కాని స్టేబుల్ గా పనిచేస్తున్న కె.కృష్ణమూర్తిని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ప్రశంసించారు. ప్రతీనెల తన జీతంనుండి కొంత మొత్తాన్ని వృద్దులకు,పేదలకు వెచ్చిస్తూ, సేవలు అందిస్తున్నందుకుగాను విశాఖ రేంజ్ డీఐజీఎల్.కె.వి.రంగారావు సాలువ తో సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డీఐజీ ఎల్. కె.వి.రంగారావు మాట్లాడుతూ విజయనగరం జిల్లా, పార్వతీపురం టౌన్ పోలీసు స్టేషనులో హెడ్ కాని స్టేబులుగా పనిచేస్తున్న కొమిరి కృష్ణమూర్తి ఏ పోలీసు స్టేషనులో పనిచేస్తున్నా, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తను పనిచేసే పోలీసు స్టేషను పరిధిలో ఉన్న వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలను సందర్శించేవారన్నారు.