హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
-కొనసాగుతున్న సోదాలు
హిందూపురం, జనవరి 11, న్యూస్:
అనంతపురం జిల్లా హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు
పెచ్చరిల్లుతున్న ట్లు ఆరోపణలపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి, ఈ నేపథ్యంలో కడప ఏసీబీ డీఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సాయంత్రం 5:30 నుండి రాత్రి వరకు సోదాలు కొనసాగుతున్నాయి, ఈ సందర్భంగా ఫిర్యాదులపై సంబంధిత అధికారుల సమక్షంలో కంప్యూటర్లో క్లుప్తంగా రికార్డులను పరిశీలిస్తున్నారు, 11వ తేదీ జరిగిన రిజిస్టర్డ్ లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు, అయితే ఈ సోదాల్లో అవినీతి అక్రమాలు ఎంతవరకు బయటపడ్డాయి, అనే విషయాలు ఇంకా సమయం పడుతుందని ఏసీబీ డీఎస్పీ కులశేఖర్ మీడియాకు తెలియజేశారు, ఇదిలా ఉండగా గత కొద్ది నెలలుగా హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వందే పని చేయరని డబ్బులు ఇస్తే తప్పుడు డాక్యుమెంట్లను తయారుచేసి రిజిస్టర్ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి, ఇంటి స్థలాలు భూ రిజిస్ట్రేషన్ లు పై డాక్యుమెంట్ రైటర్ మధ్య దళారీలు గా వ్యవహరించి రిజిస్ట్రేషన్ కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, ఈ నేపథ్యంలో ఇప్పటికైనా హిందూపురంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.