Andhra PradeshCrimeLatest NewsTelanganaYSR Kadapa
హత్య కేసులో ముద్దాయి రెడ్డి బాబు అరెస్టు
హత్య కేసులో ముద్దాయి రెడ్డి బాబు అరెస్టు
సీఐ భాస్కర్ రెడ్డి,ఎస్ ఐ చిరంజీవ
ఈనెల 13వ తేదీ ఆదివారం నాడు పులివెందులలో విజయ హోమ్స్ లో కడప కు చెందిన చాంద్ భాషా హత్యకు గురి కాబడ్డాడు. వివరాల్లోకి వెళితే కడపకు చెందిన చాంద్ భాషా, రెడ్డి బాబు అనే ఇరువురు టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. దానిలో భాగంగా పులివెందులలో వారు పని చేయడానికి రావడం జరిగినది. వీరికి దాదాపు 2 నెలల నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. దీనిలో భాగంగా ఆదివారం నాడు చాంద్ బాషా ముద్దాయి బాబును ఇష్టం వచ్చినట్లు తన కుటుంబ సభ్యులను తిట్టడం వల్ల బాబు ఇదే అదునుగా చూసుకొని పక్కనే ఉన్న పెద్ద బండ రాయి తీసుకొని కొట్టడం వల్ల అక్కడికక్కడే మరణించాడు. ఈ క్రమంలో రింగు రోడ్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న ముద్దాయి బాబును సీఐ భాస్కర్ రెడ్డి అరెస్టు చేయడం జరిగినది. ముద్దాయిని కోర్టు ఎదుట హాజరు పరుస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, ఏ ఎస్ ఐ స్వామి, కానిస్టేబుల్ మహేష్, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.