స్వాతంత్య్ర సమరయోధుడు సర్వసైన్యాధ్యక్షుడు రేనాటి వీరుడు వడ్డె ఓబన్న..లక్ష్మి నరసింహ యాదవ్
స్వాతంత్య్ర సమరయోధుడు సర్వసైన్యాధ్యక్షుడు రేనాటి వీరుడు వడ్డె ఓబన్న..లక్ష్మి నరసింహ యాదవ్ కర్నూలు జనవరి 11:-సోమవారం కర్నూలు క్యాంపులో బీసీ భవన్ ఆవరణంలోవడ్డెర సంఘంరాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య . ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఆనాటి తెల్లదొరల బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరోచిత పోరాటయోధుడు ఒడ్డె ఓబన్న .బ్రిటిష్ ప్రభుత్వ దురాగాతాలపై అక్రమంగా వసూలు చేస్తున్న పన్ను కట్టకూడదని తిరుగుబాటు చేసి తెల్లదొరల గుండెల్లో దడ పుట్టించిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న.బ్రిటీష్ సైన్యంపై గెరిల్లా యుద్ధం నైపుణ్యంతో తన ఊపిరి ఉన్నంత వరకూ పోరాడి బ్రిటిష్ మిలిటరీని ముప్పుతిప్పలు పెట్టి వీరమరణం పొందిన బలశాలి పరాక్రమవంతుడు ఒడ్డె ఓబన్న ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను దేశ రాజధానిలో రాష్ట్ర రాజధానుల్లో నెలకొల్పాలని డిమాండ్ చేశారు. వడ్డెర ఓబన్న స్ఫూర్తితో ఉద్యమిద్దాం! బిసి ఎస్సి ఎస్టి మైనార్టీ వర్గాల హక్కులకై పోరాడదామని పిలుపునిచ్చారు .వడ్డె ఓబన్న స్ఫూర్తితో బీసీలకు ముస్లిం మైనార్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నరసింహ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ కుమార్ ఆచారి కాంగ్రెస్ నాయకులు విజయ్ యాదవ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జిల్లా నాయకులు షేక్ షేక్షావలి తదితర బీసీ నాయకులు కులసంఘాల నాయకులు పాల్గొన్నారు