Andhra PradeshChittoorPolitical
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గము

చిత్తూరు మన జనప్రగతి న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి నారాయణ స్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ తొత్తులా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం ఏకపక్ష నిర్ణయం. చంద్రబాబు ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ దశలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గం.ఇప్పట్లో ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వ ఉపాధ్యాయులే అంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని మంత్రులు తెలిపారు.