స్కూళ్ళకు కరోనా సెలవులు ఫేక్- వైరల్ చేస్తే కఠిన చర్యలు- ఏపీ సర్కార్ హెచ్చరిక
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చిన కొత్త వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా స్కూళ్లకు మార్చి 1 నుంచి సెలవులు ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు వాట్సాప్‌లో పుకార్లు చెలరేగాయి. దీనిపై ఇవాళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
కరోనా కారణంగా మార్చి 1 నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కరోనా సాకు చూపి మార్చి 1 నుంచి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రకటించారు
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చిన కొత్త వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా స్కూళ్లకు మార్చి 1 నుంచి సెలవులు ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు వాట్సాప్‌లో పుకార్లు చెలరేగాయి. దీనిపై ఇవాళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.కరోనా కారణంగా మార్చి 1 నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కరోనా సాకు చూపి మార్చి 1 నుంచి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రకటించారు ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదన్నారు. ప్రస్తుతం కరోనా తర్వాత తెరిచిన పాఠశాలలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు.ఏపీలో స్కూళ్లకు కరోనా సెలవులంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైరల్ చేస్తున్న వారిపైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ఎవరూ వైరల్ చేయొద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని విద్యామంత్రి సురేష్ హెచ్చరించారు. వైరల్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సైబర్ క్రైమ్‌లోనూ ఫిర్యాదు చేశామన్నారు. పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని మంత్రి తెలిపారు. జూనియర్ కళాశాలలు కూడా షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని మంత్రి సురేష్ పేర్కొన్నారు.