Andhra PradeshLatest NewsPoliticalTelangana
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన జగన్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను ఏపీ సీఎం జగన్ కలిశారు. తన భార్య భారతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్… తన పర్యటనను ముగించుకుని ఈ మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు.
తర్వాత నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లిన జగన్… అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మరోవైపు నిన్న తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరంకు ఎన్వీ రమణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ఇరు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, పలువురు ఏపీ మంత్రులు హాజరయ్యారు.