సుపరిపాలనకు ఆదర్శనీయుడు మాజీ ప్రధాని వాజపేయి: గాలివీడులో ఘనంగా వాజపేయి జన్మదిన వేడుకలు.
గాలివీడు డిసెంబర్ 25 మన జన ప్రగతి న్యూస్:-ఇ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆదర్శనీయుడని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శివగంగి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని మండలకేంద్రంలోని స్థానిక కోదండరామాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేకును స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా వాజపేయి ఐదేళ్లపాటు దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. అంతేగాక ఫోఖ్రాన్ అనుపరీక్షల ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు దేశభక్తికి మారుపేరుగా విలువలతో కూడిన రాజకీయాలను నిర్వహించి ప్రజల మనసును చురగొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాయచోటి మండల అధ్యక్షుడు యానాం బాలాజీ, పలువురు బీజేపీ నాయకులు హరినాథ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు గొట్లమిట్ల శ్రీనువాసులు రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…