సీఎం జగన్ ను కలిసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందుల పురపాలక చైర్మన్ వల్లెపు వరప్రసాద్ మరియు వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్రెడ్డి ఇరువురు గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ మనోహర్ రెడ్డి మరియు వరప్రసాద్ తో మాట్లాడుతూ పులివెందుల అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత మీ పైనే ఎక్కువగా ఉన్నదని కావున పులివెందుల ప్రణాళికలతో ముందుకు కొనసాగాలని ఆయన పేర్కొన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి చేసే విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అందంగా మోడల్ సిటీ గా తయారు చేయాలని ఆయన దిశానిర్థేశాలు ఇవ్వడం జరిగింది పాటిస్తూ పులివెందుల మోడల్ సిటీగా తయారు చేసేందుకు మేము ముందుండి చేస్తామని వారు తెలిపారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల లోని పలువురు నాయకుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు