సాగునీటి ప్రాజెక్టులకు రూ 4371 కోట్లు ఖర్చు రోడ్ల నిర్మాణాలకు రూ 310 కోట్లు రూ 500 కోట్లతో వైయస్సార్ మెడికల్ కళాశాల నిర్మాణాలు రు 400 కోట్లతో మౌలిక వసతుల కల్పన అపాచీ లెదర్ ఫ్యాక్టరీ ,ఇర్నాసంస్థలతో ఒప్పందాలు పులివెందుల పర్యటనలో సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలు ఆవిష్కరణ
పులివెందుల డిసెంబర్ 24:-నీళ్ల విలువ తెలిసిన రైతుబిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో నేనున్నానని అందుకోసమే సాగునీటి ప్రాజెక్టులకు దాదాపుగా 4371కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల గురువారం పర్యటనలో భాగంగా ఆయన దాదాపుగా 5 వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట నుంచి చిత్రావతి ప్రాజెక్ట్ వరకు రెండు వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ను అలాగే గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టు నీటిని తరలించేందుకు మరో లిఫ్ట్ ఇరిగేషన్ ను కలిపి మొత్తం 3115 కోట్లను ఖర్చు చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలోని జమ్మలమడుగు ,పులివెందుల నియోజకవర్గాల పరిధిలోని గండికోట ప్రాజెక్టు నందు 26 టిఎంసిల నీటిని నిలిపే oదుకు ఆనాడు నాన్న వైయస్ కన్న కలలను నిజం చేశామన్నారు. అలాగే చిత్ర వతి ప్రాజెక్టు లో పూర్తి స్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు .ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో ఆర్ ఆర్ ప్యాకేజీ కింద రైతులకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు .ఈ ప్రాజెక్టుల పరిధిలో నిర్వాసితులైన రైతులకు మనమంతా ఎంతో రుణపడి ఉండాలని తెలియజేశారు .వారి సేవలు వారి త్యాగం గొప్పదని ప్రశంసించారు అలాగే 1256 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సూక్ష్మ నీటి సేద్యం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా రూ 310 కోట్ల రూపాయల తో పులివెందుల ప్రాంతంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ,లింక్ రోడ్లు ,సిమెంట్ రోడ్లు అవసరమైన రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు .మరో 350 కోట్ల రూపాయలతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇతర పథకాల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు ,మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు .సుమారు 27 కోట్లతో నియోజకవర్గ పరిధిలో దాదాపుగా నూతన ఆలయ నిర్మాణాలు ,ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేశారు .జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి, పులివెందుల రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు .అలాగే గ్రామీణ ప్రాంతం రైతాంగం అభివృద్ధి చెందేలా గుజరాత్ కు చెందిన ఇర్నా సంస్థతో పాటు అపాచీ లెదర్ కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకొని ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
రూ 500 కోట్లతో వైయస్సార్ వైద్య కళాశాల నిర్మాణాలు
పులివెందులలో రూ 500 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ వైద్యకళాశాల నిర్మాణాలు కొనసాగుతాయని ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభమవుతాయని సీఎం జగన్ వెల్లడించారు .ఇప్పటికే భూసేకరణ, టెండర్లు అన్ని పూర్తయ్యాయని రివర్స్ టెండరింగ్ చేపట్టి త్వరలో పనులు చేపడతామని తెలియజేశారు.
రూ 34కోట్లతో నూతన బస్ స్టేషన్ నిర్మాణం
పులివెందులలో రూ 34 కోట్ల రూపాయలతో స్థానిక టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా 12 ఎకరాల లో నూతన బస్ స్టేషన్ బస్ డిపో నిర్మాణాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ప్రస్తుతం ఉన్న పాత బస్ స్టేషన్ను ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే నిర్మాణాలను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.
పులివెందుల ప్రజల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను
పులివెందుల ప్రాంత ప్రజలు తనను కన్న కొడుకులా..సొంత బిడ్డలా ప్రేమ ఆప్యాయతలు పంచుతూ వారు ఎప్పుడు తనపై నమ్మకాన్ని ఉంచారని వారి రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేను అని వైఎస్ జగన్ పేర్కొన్నారు .వారి ఆశీస్సులు వల్లే తాను ఇంత స్థాయికి వచ్చాను అని పేర్కొన్నారు.