Andhra PradeshLatest NewsPoliticalTelanganaYSR Kadapa
సర్పంచ్ ని ఘనంగా సన్మానించిన గ్రామ వాలంటీర్లు
సర్పంచ్ ని ఘనంగా సన్మానించిన గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బందిరామాపురం న్యూస్ ఫిబ్రవరి 18రామాపురం మండలం చిట్లూరు గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నుకోబడిన భూమారపు రామంజులుని ఉప సర్పంచ్ ఊరగాయల మురళీమోహన్ రెడ్డిని చిట్లూరు గ్రామ వాలంటీర్లు దుశ్శాలువ,గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజలకు సహకరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనివారికి పిలుపునిచ్చారు ..గ్రామ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి అఖండ మెజార్టీతో గెలుపించిన గ్రామ ప్రజలకు నాయకులకు అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు…ఈ కార్యక్రమంలోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలమరెడ్డి, ఆది రెడ్డి ,హరినాధ రెడ్డి, వెంకటరమణ, శంకర్ రెడ్డి ,నారాయణరెడ్డి, రమేష్, విశ్వనాధ రెడ్డి ,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.