సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి కొడాలి నాని దిశా నిర్దేశం
నియోజకవర్గంలో పలు ఏకగ్రీవాలతో ఉత్సాహంలో వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు 48 పంచాయతీల్లో బలమైన అభ్యర్థులకు వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి కొడాలి నాని దిశా నిర్దేశం
గుడివాడ , ఫిబ్రవరి 11 : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ రూరల్ , నందివాడ , గుడ్లవల్లేరు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్ధులు పలువురు ఏకగ్రీవం కావడంతో ఆయా మండలాల్లో పోటీలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు . ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సర్పంచ్ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గుడివాడ రూరల్ మండలం నూజెళ్ళ గ్రామ పంచాయతీకి పరాన్ గౌస్లా , శరీవేల్పూరు గ్రామ పంచాయతీకి మేడేపల్లి ప్రభాకర్ , సైదేపూడి గ్రామ పంచాయతీకి దుంపల వెంకమ్మ , నందివాడ మండలం అరిపిరాల గ్రామ పంచాయతీకి గోవాడ వసుంధర , ఒద్దుల మెరక గ్రామ పంచాయతీకి తోట గోపాలకృష్ణ , పొణుకుమాడు గ్రామ పంచాయతీకి తెనాలి అరుణకుమారి , గుడ్లవల్లేరు మండలం కుచ్చికాయలపూడి గ్రామ పంచాయతీకి కోగంటి లక్ష్మీరమాదేవి , కల్వపూడి గ్రామ పంచాయతీకి కొత్తూరి వెంకటలక్ష్మి , గాదేపూడి గ్రామ పంచాయతీకి వీరణాల లక్ష్మణరావులు సర్పంచ్ లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఇదిలా ఉండగా గుడివాడ రూరల్ మండలంలో ఏకగ్రీవమైన గ్రామాలు మినహా 12 గ్రామాలకు ఈ నెల 13 వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది . చిరిచింతల , చౌటపల్లి , గుంటాకోడూరు , కల్వపూడి అగ్రహారం , మోటూరు , పర్నాస , రామనపూడి , సీపూడి , శేరీదింటకుర్రు , శరీగొల్వేపల్లి , సిద్ధాంతం , తట్టివర్రు గ్రామాల్లో బలమైన అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది . అలాగే నందివాడ మండలంలో ఏకగ్రీవ పంచాయతీలు మినహా 20 గ్రామాల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు . అనమనపూడి , చేదుర్తిపాడు , చినలింగాల , దండిగానపూడి , గండేపూడి , ఇలపర్రు , జనార్ధనపురం , కుదరవల్లి , నందివాడ , పెదలింగాల , పోలుకొండ , పుట్టగుంట , రామాపురం , రుద్రపాక , శంకరాపురం , తమిరిశ , తుమ్మలపల్లి , వెంకట రాఘవాపురం , వెన్ననపూడి గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి . గుడ్లవల్లేరు మండలంలో 19 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో మూడు గ్రామాలు ఏకగ్రీవం కావడంతో మిగతా అంగలూరు , చంద్రాల , చినగొన్నూరు , చిత్రం , డోకిపర్రు , కట్టావాని చెరువు , మామిడికోళ్ళ , పెంజెండ్ర , పోలిమెట్ల , పురిటిపాడు , వడ్లమన్నాడు , వేమవరం , వెణుతురుమిల్లి , విన్నికోట , ఉలవ గ్రామాల్లో సర్పంచ్ , వార్డు మెంబర్ల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు . ఇదిలా ఉండగా నియోజకవర్గంలోని గుడివాడ రూరల్ , నందివాడ , గుడ్లవల్లేరు మండలాల్లోని అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి మంత్రి కొడాలి నాని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు . పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దింపి అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారానికి పంపారు . వైసీపీ బలపర్చిన అభ్యర్ధులకు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు .