Andhra PradeshCrimeHyderabadLatest NewsRangareddySangareddySiddipetSuryapetTelangana
సంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి ఐదు మందికి గాయాలు

సంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చౌటకూర్ మండలం చౌటకూర్ వద్ద నేషనల్ హైవే 161వ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన వారిని 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.