సంక్షేమ పథకాలతో ప్రజల్లో సంక్రాంతి శోభ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
వులివెందుల జనవరి 13: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న వినూత్న సంక్షేమ పథకాలతో ఈ ఏడాది కూడా ప్రజల్లో ముందుగానే సంక్రాంతి శోభ కనపడుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపేర్కొన్నారు. సంక్రాంతి వర్వదినంసందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగిమంటల వెచ్చని వెలుగులు పరిపూర్ణమైఆరోగ్యాన్ని ప్రసాదించిమకరసంక్రాంతికాంతులతోప్రతిఇల్లూసంక్షేమసౌభాగ్యాలతో శోభాయమానంగా వర్ధిల్లాలనీ, కనుమకాంతులతో పల్లె సీమలు పశుసంపద, వ్యవసాయ, ఉద్యానపంటలతో సుభీక్షంగా కళకళలాడాలనిఆకాంక్షించారు. ఈ ఏడాది ఎలాంటి విపత్తులు లేకుండా ప్రకృతి సహకరించి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి సిరుల పంటలు పండాలన్నారు. కరోనానేపథ్యంలో ప్రజలంతా బౌతిక దూరాన్ని పాటిస్తూ తమ ఇళ్లలోనే వండుగను నిర్వహించుకోవాలన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, మనందరి భాగస్వామ్యంతో అభివృద్ధిపరంగా జిల్లా అగ్రగామిగా ముందడుగు వేయాలని అభిలషించారు. ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినిఆదరించిఆశీర్వదించాలన్నారు.