Andhra PradeshKhammamLatest NewsPoliticalTelangana
సంకల్ప’సభకు విశేష మద్దతు
ఖమ్మంలో ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘సంకల్ప’సభకు విశేష మద్దతు లభిస్తోంది. తెలంగాణ నలుమూలల నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, అనుచరులు తరలివచ్చి వైఎస్ షర్మిల కు సహకారాన్ని అందిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మహిళలు మంగళవారం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోటస్‌పాండ్‌కు తరలిరావడంతో షర్మిల కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ఖమ్మం సంకల్ప సభను విజయవంతం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసిన మహిళలు పేర్కొన్నారు.