శ్రీ రాములయ్య నిన్ను స్మరించే వారు లేరయ్యా
శ్రీ రాములయ్య నిన్ను స్మరించే వారు లేరయ్యా
.
చిట్వేలి మార్చి 16:- ఆంధ్రరాష్ట్ర అవతరణకు ,మద్రాసు నుండి తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు ,ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ రోజుల్లో ప్రాణత్యాగం చేసినటువంటి నెల్లూరు జిల్లా వాసి మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు 120 వ జయంతి ని ప్రతి ఏటా మార్చి 16న ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. కానీ అంతటి మహనీయుని గురించి నేటి యువతకు తెలియపరచాల్సిన అధికారులు పాలకులు పూర్తిగా విస్మరించారు. ప్రస్తుత కాలంలో నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలం, నా పంచాయతీ అంటూ విమర్శించుకుంటూ ఉన్నారే తప్ప తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఎలా ఏర్పడింది, అది రావడానికి కారకులెవరు వారిని పూర్తిగా విస్మరించడం సిగ్గుచేటు అని పలువురు అంటున్నారు .కనీసం కార్యాలయాల్లో పొట్టి శ్రీరాములు 120 వ జయంతి సందర్భంగా అతనికి నివాళులర్పించేందుకు మర్చిపోవడం బాధాకరం.ఇకనైనా అధికారులు స్వాతంత్ర సమరయోధులను, మరియు ప్రత్యేక రాష్ట్ర అవతరణకు ప్రాణాలర్పించిన నాయకులను, మరవకుండా వారిని స్ఫూర్తిదాయకంగా నేటి యువతకు తెలియపరుస్తారని పలువురు కోరుకుంటున్నారు .