Andhra PradeshCrimeLatest NewsSrikakulamTelanganaVisakhapatnam
శ్రీకాకుళంలో దారుణం : మహిళపై 15 మంది తాగుబోతుల అత్యాచారం!

తాజాగా శ్రీకాకుళం జిల్లా దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజాం మండలం పెనుబాక గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో అతడి స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ ఫుల్లుగా మద్యం సేవించారు. మత్తులో ఉన్న 15 మంది కన్ను సమీపంలోని బస్టాండ్లో పడుకున్న మతిస్థిమితం లేని మహిళపై పడింది. ఆమె నోరునొక్కి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన కామాంధులు మహిళపై అత్యాచారానికి యత్నించారు. బాధితురాలు కేకలు వేయడంతో భయపడిన వారు ఆమె తలపై బీరు సీసాతో కొట్టి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఆ మహిళను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.