శబరిమలలో 40కు పైగా నకిలీ ఆర్ టీపీసీఆర్ సర్టిఫికెట్లు ఉండటంతో అధికారులు షాక్
శబరిమలలో ప్రత్యేక పూజలు ప్రారంభం అయిన తర్వాత కొందరు అయ్యప్ప భక్తులు దేవస్వం బోర్డు అధికారులకు చుక్కలు చూపించారు. శబరిమలకు వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులకు కచ్చితంగా కరోనా ఆర్ టి పిసిఆర్ పరీక్షలు తప్పనిసరి చెయ్యడంతో కొందరు నకిలీ పరీక్షల పర్టిఫికెట్లు చేతుల్లో పెట్టుకుని శబరిమలకు వెలుతున్నారని వెలుగు చూసింది. దీనితో నకిలి సర్టిఫికెట్లు తీసుకు వచ్చే అయ్యప్ప భక్తులకు దేవస్వం బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
శబరిమలకు ప్రతిరోజు 5 వేల మంది వెళ్లడానికి ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు కచ్చితంగా 48 గంటల ముందు ఆర్ టీపీఆర్ సీ పరీక్షలు చేయించుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ టీపీఆర్ సీ పరీక్షలు చేయించుకుని కచ్చితంగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే శబరిమల సన్నిధానంలోకి అనుమతి ఉంటుంది. ప్రతిరోజు 5 వేల మంది అయ్యప్ప భక్తులకు కరోనా పరీక్షలు చేసే బాధ్యత వారు తీసుకు వస్తున్న ఆర్ టీపీఆర్ సీ పరీక్షల సర్టిఫికెట్లు పరీశీలించే బాధ్యతను నీలక్కల్ లోని పోలీసు కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు దేవస్వం బోర్డు అధికారులకు అప్పగించారు.
అయితే అయ్యప్ప భక్తులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడంలో వారు తీసుకువస్తున్న సర్టిఫికెట్లు పరిశీలించడంలో విఫలం అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. శబరిమలకు వెళ్లే భక్తులు ఆర్ టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని వెలుతున్న వారి సర్టిఫికెట్లను నీలక్కల్ పోలీసులు పరిశీలించారు. నీలక్కల్ పోలీసు కంట్రోల్ రూమ్ లో మొత్తం 3 225 అయ్యప్ప భక్తుల ఆర్ టీపీసీఆర్ పరీక్షల పత్రాలు పరిశీలించగా అందులో 40కు పైగా నకిలీ ఆర్ టీపీసీఆర్ సర్టిఫికెట్లు ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. కొందరు అయ్యప్ప భక్తులు ఇలాంటి నకిలీ ఆర్ టీపీసీఆర్ సర్టిఫికెట్లు తీసుకువచ్చి సాటి అయ్యప్ప భక్తుల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం మంచిదికాదని దేవస్వం బోర్డు అధికారులు అన్నారు. ఖచ్చితంగా చెక్ చేపించుకొని నెగటివ్ ఉంటేనే రావాలని కోరుతున్నారు.