వైయస్సార్ చేయూత లబ్ధిదారులు రుణ సదుపాయం
వైయస్సార్ చేయూత లబ్ధిదారులు రుణ సదుపాయం
లింగాల మండలం కోమన్నూతల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ మునయ్య తో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ డిఆర్డిఏ వైయస్ఆర్ క్రాంతి పథం ఆంజనేయులు సమావేశమై పలు అంశాల పైన చర్చించారు వైయస్సార్ చేయూత లబ్ధిదారులు అయినటువంటి వారికి మేకలు గొర్రెలు పొట్టేలు ఆవులు గేదెల కొనుగోలుకు రుణ సదుపాయం కల్పించాలని ఎస్బిఐ కోమన్నూతల బ్రాంచ్ పరిధిలో 28 మంది అర్హత సాధించారని వారందరికీ సంబంధిత యూనిట్స్ గ్రౌండింగ్ చేయుటకు అవకాశం కల్పించాలని ఏపీఎం ఆంజనేయులు కోరారు. వైయస్సార్ బీమా నమోదు కొరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ఈ నెల 12 తారీకు తో ముగుస్తుందని ఆలోపు అర్హత కలిగిన ప్రతి రేషన్కార్డుదారులకు ఎస్బిఐ నందు బ్యాంక్ ఖాతా కలిగినవారికి బీమా వసతి కల్పించాలని ఆ మేరకు ఆన్లైన్లో నమోదు చేయాలని ఫీల్డ్ ఆఫీసర్ కు అకౌంట్ ఆఫీసర్ కి గ్రామ సచివాలయ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ కు సూచించారు ఈ కార్యక్రమంలో కోమన్నూతల గ్రామ సమాఖ్య అసిస్టెంటు వెంకటరమణయ్య పాల్గొన్నారు