Andhra PradeshLatest NewsPoliticalTelanganaVisakhapatnam

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ 
 టీడీపీ , జనసేన , ఇతర పార్టీలు కలిసి రావాలి  సంక్షోభాన్ని రాజకీయంగా వాడుకునేందుకు చూడొద్దు   రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జగన్ వెంటే ప్రజలు  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 
తాడేపల్లి , ఫిబ్రవరి 12 : వైజగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు . వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని వైజాగ్ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారన్నారు . పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రిక్వస్ట్ చేసి వచ్చారని , ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడన్నారు . స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు . తెలుగుదేశం , జనసేన , ఇతర పార్టీలు కూడా కలిసి రావాలన్నారు . ప్రజాపోరాటం చేయాల్సి వస్తే అందరూ సిద్ధపడాలని , అలా కాకుండా ఈ సంక్షోభాన్ని రాజకీయంగా వాడుకునేందుకు చూస్తున్నారన్నారు . పార్లమెంట్ లో , బయట కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా వైసీపీ కృషి చేస్తుందన్నారు . చంద్రబాబు పెద్ద డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ అని , ఆయన దెబ్బకు ఎన్టీఆరే కిందపడిపోయారన్నారు . గత 30 ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాటకాలను చూస్తూనే ఉన్నారని , ఆయన తీసేసిన తహసీల్దార్ అని , ప్రజలెప్పుడో రాజకీయ సమాధి కట్టారన్నారు . రాష్ట్రంలో టీడీపీ ఏదో విధంగా నిలబడాలంటే ప్రజలు తిరస్కరించిన చంద్రబాబును ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు , క్యాడర్ మెడపెట్టి బయటకు గెంటాలన్నారు . అలా కాకుండా చంద్రబాబును పెట్టుకుని పార్టీ నడిస్తే టీడీపీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు . పంచాయతీ ఎన్నికల దగ్గర నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలనైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటుందన్నారు . రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు జగన్మోహనరెడ్డి వెంటే ఉంటారన్నారు . ఎన్నికలంటే చంద్రబాబు వంటి చవట దద్దమ్మలు భయపడతారన్నారు . చంద్రబాబుకు ఉన్న కొద్దిపాటి మెదడు కూడా మొదటి విడత ఎన్నికల ఫలితాల తర్వాత పోయిందన్నారు . చంద్రబాబు మానసిక పరిస్థితి గురించి మెంటల్ డాక్టర్‌ను అడిగితే సరిగ్గా చెబుతారని , తనకు అంత నాలెడ్జ్ లేదని మంత్రి కొడాలి నాని అన్నారు .

Mana Jana Pragathi

Mana Jana Pragathi is one of the Best Telugu Daily News Paper. Readers get the latest information around the world on time from their mobile device. Readers can browse category wise news like political, cinema, education and sports etc. Readers can browse daily paper at our paper portal.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected a AdBlocker on your browser, please add us for the exemption to support us.