వేలిముద్రలు, ఐరిష్ కళ్ళు సరిపడని వారికి పెన్షన్లు పంపిణీ అయ్యేలా చూడాలి(సెర్ఫ్ సిఈఓ ను కోరిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి)
రాయచోటి జనవరి 2ప్రభుత్వం అందచేస్తున్న పెన్షన్ల పంపిణీలో వేలిముద్రలు, ఐరిష్ కళ్ళు సరిపడని లబ్దిదారులకు పెన్షన్లు అందేలా చూడాలని సెర్ఫ్ సిఈఓ ను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. శనివారం ఉదయం రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ని పలువురు వికలాంగ పెన్షన్ లబ్దిదారులు కలసి గత మూడు నెలల నుంచి తమ వేలిముద్రలు , ఐరిష్ పడక పోవడంతో పెన్షన్లు అందలేదని, ఈ నెలలో పెన్షన్ పొందకపోతే పెన్షన్ నిలిచిపోతుందని తిరిగి పెన్షన్ పొందాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని విన్నవించారు. చీఫ్ విప్ వారి సమస్యలపై తక్షణం స్పందించి సెర్ఫ్ సి ఈ ఓ , డి ఆర్ డి ఏ పిడిల దృష్టికి ఫోన్ ద్వారా ఈ సమస్యను తీసుకెళ్లారు.జిల్లాలో మూడు వందలమందికి పైగా లబ్ధిదారులు ఇటువంటి సమస్యల కారణంగా పెన్షన్లును మూడు నెలలుగా పొందలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుచున్నారని ఆయన వివరించారు. ఇటువంటి సమస్యలతో పెన్షన్లు పొందలేకున్న నిజమైన లబ్ధిదారులకు పి డి ఓ అతేంటికేషన్ తదితర పరిష్కార చర్యలు చేపట్టి పెన్షన్లు పంపిణీ చేయాలని చీఫ్ విప్ సూచించారు.ఈ సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని సదరు పెన్షన్లును పంపిణీ చేస్తామని చీఫ్ విప్ కు సెర్ఫ్ సి ఈ ఓ హామీ ఇచ్చారు.చీఫ్ విప్ స్పందనపై పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.