విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిర్వాసితులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిర్వాసితులు
విశాఖపట్నం ఫిబ్రవరి 10:-విశాఖ ఉక్కు కోసం ఉద్యమించి లాభం లేదు అన్నట్టుగా మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్ మండిపడ్డారు.ఆంధ్రుల గుండెచప్పుడైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా నజీర్ హాజరై సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉద్యమాన్ని నీరుగార్చేవిధంగా విజయసాయి మాట్లాడటం సహించరానిదన్నారు.స్టీల్ ప్లాంట్ భూములను దోచుకోవడమే వైసీపీ లక్ష్యంగా కనబడుతోందని దుయ్యబట్టారు. ఉద్యమాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టటానికి దళారీ అవతారమెత్తినట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేసారు. విజయసాయిరెడ్డి మాటలు తెలుగుదేశం చెప్పినట్టు విశాఖ ఉక్కు అమ్మకం వైసీపీ కుట్రే అనేది ధ్రువపర్టుస్తున్నాయన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిర్వాసితులు కు న్యాయం జరిగేవరకు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కు సంఘీభావంగా కార్యకర్తలు మరియు జిల్లా పార్టీ నాయకులందరూ గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలిరావాలని నజీర్ పిలుపునిచ్చారు.