విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
బద్వేలు ,ఫిబ్రవరి 13:-
విశాఖ ఉక్కు సాధనకు నాటి ప్రతిపక్ష కమ్యూనిస్టు ఎమ్మెల్యేల ఉమ్మడి రాజీనామాలలు చేశారని
1952 నుండి 1965 వరకు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే విశాఖ ఉక్కు వచ్చిందని,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సిపిఎం అడ్డుకుంటుంది ఆంధ్ర ఉద్యమంగా నడుపుతుందని,
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి కడప ఉక్కు ఫ్యాక్టరీ ని నిర్మించాలని ఈ నెల 16న జిల్లా కేంద్రంలో జరిగే బైక్ ర్యాలీని జయప్రదం చేయండని
సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనువాసులు పిలుపు నిచ్చారు బద్వేలు పట్టణం లోని సీఐటీయూ కార్యాలయం నందు సిపిఎం పట్టణ కార్యదర్శి కోగిలంపాటి శ్రీనువాసులు శుక్రవారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో భారీ ఉక్కు పరిశ్రమ,నిర్మాణం కోసం దేశవ్యాప్త ఆందోళనలో 1952 నుండి 1965వరకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆందోళన నిర్వహించిందని వారన్నారు. నాటి నెహ్రు 18 సంవత్సరాల పరిపాలనలో ఉక్కు టెక్నాలజీ నాటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి దేశాలు ఏ ఒక్కటి ఇవ్వలేదు అని అన్నారు.నాటి అభివృద్ధి చెందిన ఏకైక కమ్యూనిస్టు దేశమైన యునైటెడ్, సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ మాత్రమే ముందుకొచ్చిందని అన్నారు.ఆ నాటినుండి భారత,రష్యా మైత్రిబంధం చిరకాలంగా కొనసాగింది అన్నారు.నేడు బిజెపి ప్రభుత్వం వాటిని తన కార్పోరేట్ సహచరులకు పంచి పెడుతుందని విమర్శించారు.1965-66లలో నాటి ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షం గా ఉన్న ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ శాసనసభా పక్ష నాయకులు విశాఖపట్నం లో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ నాలుగు పదులకు పైగా ఉన్న కమ్యూనిస్టు శాసన సభ్యులు కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో రాజీనామాలు చేసి విశాఖ ఉక్కు సాధన ఉద్యమంలో భాగస్వాములైన విషయం నేటి పాలక వైస్సార్సీపీ ,ప్రధాన ప్రతిపక్షం టిడిపి శాసన సభ్యులు గుర్తెరేగాలన్నారు.శాసనసభ లో తీర్మానం చేసి ఢిల్లీ పాలకుల కళ్ళు తెరిపించాలి అని వారు డిమాండ్ చేశారు.దేశ పురోగతిలో కీలక పాత్ర వహించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణ ను సిపిఎం అడ్డుకుంటుంది అన్నారు.ఇది ఆంధ్రరాష్ట్ర ఉద్యమంగా మండల, పంచాయితీ స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తుంది అన్నారు.ఆచరణాత్మక, ఆందోళన,కార్యాచరణను ప్రజాశ్రేణుల భాగస్వామ్యంతో నడుపుతుందని తెలిపారు. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కడప జిల్లా లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఈ నెల 16 వ తేదీన జిల్లా కేంద్రం కడపలో నిర్వహించే బైక్ ర్యాలీలో పట్టణంలోని ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు,యువకులు మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ ,అవాజ్ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా,కెవిపిఎస్ పట్టణ అధ్యక్షుడు గిలక రాజు సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.