Andhra PradeshCrimeLatest NewsTelanganaVisakhapatnam
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి

అనంతగిరి: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అరుకు ఘాట్‌రోడ్డులో డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఐదో నంబర్ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను అనంతగిరి ఆస్పత్రికి తరలిస్తున్నారు. లోయలో పడిన బస్సును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తిగా చీకటి పడటంతో సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.