వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారు : వైఎస్సార్ సోదరి విమలమ్మ

వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ ఉత్కంఠ కొనసాగుతున్న క్రమంలో వెస్సార్ సోదరి విమలమ్మ మీడియా ముందుకొచ్చారుసంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థతి తెలుసుకోవటానికి వచ్చిన విమలారెడ్డి వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి గురించే చేసారనే అనుకోవచ్చు. కానీ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని విమలమ్మ చెప్పారు. దీంతో విమలమ్మ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవినాశ్ ఏ తప్పు చేయలేదని వివేకాను చంపినవాళ్లు మాత్రం బయట స్వేచ్ఛగా విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంటూ విమలమ్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే వివేకాను హత్య చేసింది ఎవరు? బయట తిరిగేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ఉన్న అవినాశ్ కు ధైర్యం చెప్పటానికి..అతని తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆమె ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థించటానికి తాను కర్నూలు వచ్చానని తెలిపారు విమలమ్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కష్టాల్లో ఉంది అంటూ చెప్పుకొచ్చారు విమలమ్మ. అవినాశ్ తల్లి తన కుమారుడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే ఆందోళనతో కృంగిపోయారని ఆమెకు, ఏ తప్పు చేయని అవినాశ్ కు ధైర్యం చెప్పటానికి తాను కర్నూలు వచ్చానని తెలిపారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ త్వరలోనే బటయపడతారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న కాలంలో మా కటుంబాలు అన్నీ చాలా సంతోషంగా ఉండేవాళ్లమని..కానీ ఇప్పుడా పరిస్థితిలేదని వాపోయారు విమలారెడ్డి.ఇప్పుడు మా కుటుంబాల్ని చాలా భయంకరమైన స్థితిలో ఉన్నామని తెలిపారు.ఇప్పుడు వైఎస్సార్ కుటుంబం చాలా కష్టాల్లో ఉందని అన్నారు.కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు రోజుకో ట్విస్టు కాదు గంటకో ట్విస్టు అన్నట్లుగా మారిపోయింది. ఈకేసుని సీబీఐ విచారిస్తున్న క్రమంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. వైఎస్ అవినాశ్ తండ్రి ఈకేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక అవినాశ్ అరెస్ట్ ఇప్పుడో కాసేపటికో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో అరెస్ట్ భయంతో అవినాశ్ రెడ్డి ఇప్పటికే అటు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నా ఫలితం దక్కటంలేదు. మరోపక్క సీబీఐ అరెస్ట్ చేయకుండా సాగదీస్తోంది. దీంతో అవినాశ్ అరెస్ట్ విషయంలో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఈక్రమంలో మరో ట్విస్టుు వైఎస్సార్ సోదరి విమలమ్మ వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు మరింత ఆసక్తికలిగిస్తున్నాయి. మరి వివేకాను చంపింది ఎవరు? వారిని ఎందుకు సీబీఐ అరెస్ట్ చేయలేదు? అనే ఆసక్తి నెలకొంది.