Andhra PradeshLatest NewsVizianagaram
విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో 12 మందిఅనుమానితులను అరెస్టు ఎస్పీ
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ప్రస్తుతం దేవస్థానం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 12 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నామన్నారు. మంత్రులు బొత్స, వెల్లంపల్లి పర్యటన సందర్భంగా రామతీర్థం వచ్చిన ఎస్పీ.. మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. దీని వెనుక ఎంతటి వారున్నా శిక్ష తప్పదన్నారు.