వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన ఓఎస్డీ,మండల అధికారులకు

పులివెందుల :- ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షానికి దెబ్బతిన్న అరటి తోటలను ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి,తహశీల్దార్ మాధవ కృష్ణారెడ్డి ఆర్టికల్చర్ అధికారులు ఇ కొత్తపల్లి వెలమవారిపల్లె గ్రామాలలో నెలకొరిగిన అరటి తోటల్లో పరిశీలించారు.ఎన్ని ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయో వాటిని క్షేత్ర స్థాయిలో పక్కాగా గణన చేపట్టాలని ఉద్యానవన అధికారులను ఓఎస్‌డీ ఆదేశించారు.ఈదురుగాలులు,భారీ వర్షానికి ఎక్కువ ప్రభావం చూపిన వాటిలో పులివెందుల,లింగాల,వేముల మండలాలుగా గుర్తించగా వాటిలో 1007మంది రైతులకు చెందిన 917హెక్టార్లలలో అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు హార్టికల్చర్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.ఒకవైపు క్షేత్రస్థాయిలో హార్టికల్చర్ అధికారుల పూర్తిస్థాయి గణన చేపట్టారు.ఆయన వెంట మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు,డీడీ లావణ్య,హార్టికల్చర్ అధికారి రాఘవేంద్ర,తదితరులు పాల్గొన్నారు.