Cinema

వరుణ్‌, తమన్నాలకు క్లాప్‌ ఇచ్చిన అల్లు అరవింద్‌

సాక్షి, హైదరాబాద్‌: వెంకటేష్ , వరుణ్ తేజ్‌లు హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో గతేడాది వచ్చిన ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్) మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్‌లు నటించారు. కామెడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం  టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద బ్లక్‌బస్టర్‌ హీట్‌గా నిలిచింది. దీంతో ఇదే కాంబినేషన్‌లో ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అదే దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభ పూజ కార్యక్రమం  గురువారం హైదబాద్‌లో జరిగింది. హీరోయిన్‌ తమన్నా, హీరో వరణ్‌ తేజ్‌ల ఓ సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎఫ్‌ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్‌ 3’ని కూడా నిర్మించనున్నారు.

Mana Jana Pragathi - f3 - May 28, 2023

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected a AdBlocker on your browser, please add us for the exemption to support us.