లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే నా!
ప్రస్తుతం టాలీవుడ్ వెండితెర మీద ముంబై భామ పూజ హెగ్డే హవా మాములుగా లేదు. వరుస భారీ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ‘అరవింద సమేత’ గడ్డలకొండ గణేష్ మహర్షి లాంటి భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా కూడా ఉంది.
అయితే ఇప్పటికే తెలుగులో రాధేశ్యామ్ తో పాటు అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ షూటింగ్ కూడా ఈ భామ కంప్లీట్ చేసుకుందట. ఇవేగాక బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ సరసన ‘సర్కస్’ సినిమా షూటింగులో పాల్గొంది అమ్మడు. ఇదివరకే కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే పూజా చేతిలో ఈ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ అమ్మడి హవాను కంటిన్యూ చేస్తూ ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. పూజా రానున్న కొత్త సంవత్సరంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పనున్నట్లు సమాచారం. ఇంతవరకు హీరోల సరసన రొమాన్స్ చేసింది చాలు అనుకుందేమో.. అందుకే ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మల్లబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. ఒకవేళ పూజా గనక ఓకే చేస్తే అది గుణశేఖర్ రూపొందించునున్న ‘శకుంతలం’ సినిమానే అయ్యుండొచ్చు అని టాక్.