Andhra PradeshCrimeLatest NewsTelanganaYSR Kadapa
లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయనపల్లి మండలం గంగిరెడ్డిపల్లి వద్ద గల మలుపు వద్ద సోమవారం ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. వేంపల్లి నుండి ఎర్రగుంట్ల వెళుతున్న లారీ వేగంగా వచ్చి బోల్తా పడి ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కరెంటు స్తంభాన్ని లారీ ఢీకొనడంతో కరెంటు తీగలు తెగి లారీ మీద పడ్డాయి. కరెంటు ఉన్న వైపు వైర్లు తెగిపోవడంతో వైర్లులో విద్యుత్ లేక పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వీరపునాయన పల్లి పోలీస్ ఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు