లక్ష్మీ మాధవ రాయ స్వామికి ఎమ్మెల్యే పూజలు
మైదుకూరు, , జనవరి 13 : సంక్రాంతి వచ్చిందంటే మైదుకూరు మునిసిపల్ పరిధిలో పురాతన దేవస్థానమైన శ్రీ లక్ష్మీ మాధవ రాయుని పార్వేట మహోత్సవాలు 16 పల్లెల్లో ఘనంగా జరుగుతాయి. ఈ ఏడూ సంక్రాంతి పర్వదిన మొదటి రోజైన భోగి పండుగ నాడు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి కుటుంబ సభ్యులు స్వామి వారి పూజలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ఛైర్మన్ భూమిరెడ్డి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్వామి వారి దేవస్థానం లో నిర్వహించే కార్యక్రమ వివరాలను ఎమ్మెల్యే కు దేవస్థాన చైర్మన్ భూమిరెడ్డి సుబ్బారాయుడు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ని, సమన్వయ కర్త శెట్టిపల్లె నాగిరెడ్డి ని, సన్మానించారు. కార్యక్రమంలో చైర్మన్ భూమిరెడ్డి సుబ్బారాయుడు, పట్టణ అధ్యక్షుడు కేశా లింగన్న, సీనియర్ న్యాయవాది లింగన్న, మాచానూరు చంద్ర, శ్రీమన్నారాయణ, లక్షుమయ్య, కొండారెడ్డి, సుబ్బారెడ్డి, గౌస్ పీర్, చాపల షరీఫ్, ఎమ్మారెఫ్ సుబ్బయ్య, మూలే భరత్ కుమార్ రెడ్డి, గౌస్ పీర్, నాయబ్, గుడిపాడు బాబు, బి.పి శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు. సి.ఐ మధుసూదన్ గౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.