Andhra PradeshTelangana
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల ధరలు తగ్గింపు
అమరావతి: కోవిడ్ పరీక్షలకు సంబంధించి నిర్వహించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల ధరలను తగ్గిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ఛార్జీలతో కలిపి ఒక్కో కిట్‌కు రూ.230 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐసీఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని ల్యాబ్‌లూ ఈ మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల్లో పేర్కొన్నారు.