Andhra PradeshCrimeHyderabadLatest NewsRangareddySangareddyTelangana
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని సికింద్రాబాద్ జవహర్ నగర్ సాకేత్ టవర్స్ వద్ద చోటు చేసుకుంది. మృతుడిని అభినవ్(19) గాపోలీసులు గుర్తించారు. ఉదయం బైక్‌పై కళాశాలకు వస్తుండగా బైక్ అదుపు తప్పి విద్యార్ది పైనుంచి టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు అభినవ్ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.