రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు
రేణిగుంట, మన జన ప్రగతి
నేడు చిత్తూరు,పుత్తూరు,తిరుపతి గాంధీ విగ్రహాల వద్ద నిరసన చేపట్టడానికి రేణిగుంట ఆంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.చంద్రబాబునాయుడు పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరించారు.రేణిగుంట ఆంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల బలగాలను మోహరించారు..ఇప్పటికే ఎయిర్ పోర్ట్ కి వెళ్లి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ప్రయత్నించిన టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు..రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు నిలిపివేశారు.రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు…నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేసారు.చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని,చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారుఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 14 ఏళ్లుగా సీఎం గా ఉన్నాను.. ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్నాను.. ఎందుకు నన్ను ఎయిర్పోర్టులో నిర్బంధిచారు.ఇది ప్రజాస్వామ్యమా లేక ఇది రాక్షసత్వమా. నేను ఈ జిల్లా కలెక్టర్ను.. ఎస్పీ ని కలుస్తాను..నన్ను ఎందుకు ఎయిర్పోర్టులోనే ఆపుతున్నారు.. గౌరవంగా పక్కకు తప్పుకోండని..చంద్రబాబు అన్నారు.రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు.. టిడిపి నేతలను దిగ్బంధం చేస్తున్న పోలీసులు..