రెండు నెలల చిన్నారి అదృశ్యం చిన్నారి మృతి
రెండు నెలల చిన్నారి అదృశ్యం
అనంతపురం మన జనప్రగతి అక్టోబర్ 22:- జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున చెట్టెమ్మలకు రెండు నెలల చిన్నారి ఉంది అయితే ఆ చిన్నారిని హాస్పిటల్ కు దంపతులు తీసుకొచ్చారు.
భార్యను హస్పెటల్ దగ్గర ఉండమని చెప్పి చిన్నారిని తీసుకొని భర్త నాలుగు గంటలైన రాకపోవడం తో అనుమానం వచ్చిన తల్లీ పోలీస్ లకు పిర్యాదు చేసింది. గాలించిన పోలీస్ లు ఐదుకల్లు గ్రామానికి వెళ్లే రహదారి లో వెతకడం మొదలు పెట్టారు.
ఆ చిన్నారిని తీసుకెళ్లినపుడు ఉన్న టవల్ తదితర వస్తువులు పక్కనే ఉన్న చెరువు దగ్గర లభ్యం కావడం తో ఆ చిన్నారిని చంపాడని అనుమానంతో తల్లీ ఫిర్యాదు మేరకు..తండ్రి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలు పోలీసుల విచారణ లో తెలియాల్సి ఉంది. మల్లికార్జున ఆచూకీ ఎవరికైనా తెలిసిన వెంటనే పోలీసులుకు సమాచారం తెలియచేయాలని కళ్యాణదుర్గం టౌన్ సిఐ.తేజోమూర్తి తెలిపారు. కాగా ఆ చిన్నారి రెండు నెలల చిన్నారి మృతి . శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామం బైపాస్ పక్కన ఉన్న చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది.